నెల్లూరు జిజిహెచ్ లో కరోనా పేషెంట్లు ఇస్తున్న ఆహార మెనూ పై అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్... జిజిహెచ్ సూపరిటెండెంట్ సుధాకర్ రెడ్డి ని ప్రశ్నల వర్షం లో ముంచెత్తిన అనంతరం స్వయంగా కరోనా పేషెంట్లకు అందజేస్తున్న ఆహారాన్ని అక్కడే భోజనం చేశారు.. కరోనా పేషెంట్ లకు ఏమేమి ఇస్తున్నారో ఆహారపదార్థాల నాణ్యతను పరిశీలించారు... కోవిడ్ పేషెంట్లకు రాత్రిపూట పాలు ఇస్తే బాగుంటుందని ఆయన అధికారులకు సూచించారు. కోవిడ్ పేషెంట్లకు ఇస్తున్న ఆహారాన్ని రుచి చూసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్... మొత్తం ఆహార పదార్థాల మెనూ మార్చాలని సూచించినట్టు తెలిసింది ..
మంత్రి అనిల్ కుమార్ ఆకస్మిక పర్యటన తో నీళ్లు నములుతున్న జిజీహెచ్ అధికారులు
.. జిజిహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి కి కాస్త తోడుగా డాక్టర్ నరేంద్ర కూడా వచ్చి సమాధానాలు చెప్పడం గమనార్హం
 నెల్లూరు నగరంలోని దర్గామిట్ట నందు గల జిల్లా

ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కోవిడ్ సెంటర్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు ఆకస్మిక తనిఖీ చేసి కరోనా బాధితులకు అందిస్తున్న భోజనాలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకొని, అనంతరం అక్కడే భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు.