ఫాజిల అనే యువతిని ప్రేమించి పెళ్లాడుతా నని మోసం చేసిన మెప్మా ఉద్యోగి షాకీర్ ఆ యువతికి న్యాయం జరగాలని  మెప్మా ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించిన ఏఐవైఎఫ్ నాయకులు.....

ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ సయ్యద్ సిరాజ్ మాట్లాడుతూ షాకీర్. ఫాజిల  అనే యువతి వెంటపడి ప్రేమించానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని తన పెద్ద వారిని కూడా తీసుకు వచ్చి మాట్లాడించి ఆ అమ్మాయిని గర్భవతిని చేసి వదిలేశాడు ఇప్పుడు ఆ అమ్మాయికి మూడు నెలల బాబు ఉన్నాడు అయితే షాకీర్ కి ఇంతకుముందే పెళ్లి అయ్యి ఒక కొడుకు  ఉన్నాడు ఆ విషయాన్ని దాచిపెట్టి వాళ్ళ పెద్ద వాళ్ళు అందరూ కలిసి ఈ అమ్మాయిని దారుణంగా మోసం చేశారు ఈ అమ్మాయికి తగిన న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తారు ఈ కార్యక్రమంలో షాన్ వాజ్. మున్నా. ముక్టియార్. నూర్ ఖాన్. రఫీ. గౌస్. దస్తగిరి. షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు