సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా ఇన్సూరెన్స్ అందజేస్తామని, అలాగే ప్రభుత్వం పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని, ఇల్లు లేని వారికి ఇల్లు కూడా నిర్మిస్తామని వారికి బరోసా కల్పించారు.