అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ ధ్యేయంగా పని చేస్తోందని చివరకు తలమీద బొచ్చు కూడా వదలకుండా అన్నిట్లో అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి టిడిపి రాష్ట్ర నేత దేవినేని ఉమామహేశ్వర రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు నెల్లూరు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం, ఇసుక లో దోచుకుంటున్నారని ధ్వజ మెత్తారు. అవినీతి చేయడమే ధ్యేయంగా వైఎస్ఆర్ నాయకులు పని చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.