ల్లూరు జిల్లా మర్రిపాడు ప్రభుత్వ ఆసుపత్రి ముందు అల్లంపాడు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అల్లపాడు గ్రామానికి చెందిన పెంచలయ్య అనే వ్యక్తికి గుండెల్లో నొప్పి రావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు మర్రిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పెంచలయ్య చనిపోయాడంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రిలో డాక్టర్ ఉండి కూడా నర్సుల చేత వైద్యం చేయించారని, తెలిసి తెలియని వైద్యం చేయడంతోనే తమ కుటుంబ పెద్ద మృతి చెందాడు అంటూ ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఈ నిర్లక్ష్యపు డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మృతుడి బంధువుల నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.