MRPS వ్యవస్ధాపకుడు మందాకృష్ణ మాదిగ ఈనెల 30 వ తేదీన కావలి మండలం సిరిపురంలో జరుగు జిల్లా స్ధాయి MRPS ,అనుబంధ సంఘాల కార్యకర్తల సమీక్ష సమావేశంకు హజరవుతున్నట్లు ఈ సభను జయప్రదం చేయవల్సిందిగా MRPS జిల్లా ఇన్చార్జ్ గొల్లపల్లి శ్రీనివాస మాదిగ తెలియజేసారు. శుక్రవారం స్ధానిక జర్నలిస్ట్ క్లబ్ నందు వారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ సిరిపురంలో మందాకృష్ణ మాదిగ పొల్గొనే  సభా స్ధలంను mef జాతీయ నాయకులు పరుసు రమేష్ మాదిగ ,Mrps రాష్ట్ర ఉపాద్యక్షుడు గోసిపాతల వెంకటేశ్వర్లు మాదిగ ,మండల అద్యక్షుడు అక్కిలగుంట ఏసు మాదిగ ,గ్రామ పెద్దలతో కలసి పరిశీలించటం జరిగిందన్నారు. అలానే ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తామన్న తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు అసంబ్లీలో తీర్మానం చేసి వర్గీకరణకు సహకరించాలన్నారు. మమందాకృష్ణ మాదిగ పాల్గొనే ఈ సభలో డివిజన్ లోని అన్ని మండలాల mrps ,mef,msf,mys,MMS,vhps,నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈకార్యక్రమంలోmrps  రాష్ట్ర ఉపాధ్యక్షులు గోసిపాతల వెంకటేశ్వర్లు మాదిగ ,జిల్లా అధికార ప్రతినిధి పందింటి అంబెడ్కర్ మాదిగ, కావలి మండల అద్యక్షులు అక్కిలగుంట ఏసు మాదిగ ,పట్టణ అద్యక్షుడు చేవూరి కిరణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.