కావలి ఏరియా హాస్పిటల్ సూపరిడెంట్ గా సెప్టెంబర్ 2వ తేదీన బాధ్యతలు చేపట్టిన మండవ వెంకటేశ్వర్లు ఈరోజు ఏరియా ఆస్పత్రి నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఆయన మాట్లాడుతూ 
తాను సూపరిడెంట్ పదవిని అలంకరించినప్పటి నుండి కొన్ని అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. 
గత 9నెలలుగా ఏరియా ఆస్పత్రి సలహా మండలి సమావేశం నిర్వహించలేనటు వంటి విషయం తెలిసిందేనని అలాంటిది మొదటి సారిగా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధ్యక్షతన  సమావేశం నిర్వహించామన్నారు. 
ఆ సమావేశంలో కాన్పులు, ఎమర్జెన్సీ, ఆపరేషన్ ధియేటర్లు, ఐసోలేషన్ వార్డులో సెంట్రల్ ఆక్సీజన్ లిక్విడ్, ఆక్సీజన్ క్రిష్టల్ ద్వారా సప్లై చేయాలని తీర్మానించడము జరిగిందని అన్నారు. 
రాష్ట్ర స్ధాయిలో ప్రభుత్వ, కార్పోరేటు ఆస్పత్రులు 215 ఉండగా కావలి ఏరియా ఆస్పత్రి 5వ స్ధానము‌లో అలాగే రాష్ట్ర స్ధాయి ప్రభుత్వ ఆస్పత్రులలో ద్వితీయ స్ధానము సాధించడం జరిగింది అన్నారు. అందరి సహకారముతో మున్ముందు ప్రధమ స్ధానం సాధించుటకు సాయశక్తులా కృషిచేస్తామన్నారు. 
రెండు వెంటిలేటర్ల ద్వారా వైద్యసదుపాయము అతి త్వరలో ప్రారంభించి  నెల్లూరుకు రెఫర్ చేసే అంశాన్ని కుదిస్తామని అన్నారు. ఇంత వరకు ఐసోలేషన్ వార్డులో 2268 అడ్మిషన్స్ జరిగాయని. వాటిలో 1148 డిశ్చార్జులు జరిగాయని. టిడ్కో కోవిడ్ కేర్ సెంటర్ నందు వైద్యము చేయడం జరిగిందన్నారు. కావలి ప్రభుత్వ ఆస్పత్రికి సంభందించి ఒక మరణం కూడా లేదని అన్నారు.
రక్తనిధిలో పాడైన ఫ్రిజ్ లను రిపేరు చేయించి రక్త నిల్వల సేవలు ప్రారంభించడానికి సిద్దంగా ఉందన్నారు.
శాసన సభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ద్వారా 18 లక్షలు రూపాయలు గ్రాంటు ద్వారా టాయిలెట్ శానిటరీ పనులు, డ్రైనేజి పనులు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.
రెండు మూడు నెలల సమయంలో కొత్త ఓపి బ్లాక్ , వార్డులు, డయాలసిస్ యూనిట్ ప్రారంభించుటకు శాసన సభ్యులు రామారెడ్డి ప్రతాప్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. 
కరోనా ఎ.టి టెస్ట్,  వి.ఎల్.ఎమ్(ట్రూనాట్) పరీక్షలు ఏరియా ఆస్పత్రిలోనే నిర్వహిస్తున్నామని, విటిఎమ్(ఆర్.టి.పి.సి.ఆర్) టెస్ట్ స్వాబ్స్ తీసి నెల్లూరు పంపడం జరుగుతుందన్నారు. కోవిడ్ పరీక్షల కొరకై వచ్చిన వారందరికి పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. 
ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్స్ స్టాఫ్ నర్సులు, పారిశ్రామిక సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది సహకారంతో రాబోయే రోజులలో మరిన్ని విజయాలు సాధించగలమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి ఆర్.ఎమ్ ప్రసూన పాల్గొన్నారు.