చిట్టమూరు మండలం మొలకలపూడి పంచాయతీ స్వచ్ఛ పంచాయతీగా ఎంపిక కావడంపై స్థానిక ,ఇన్చార్జి అధికారుల ఆధ్వర్యంలో మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక వైకాపా నాయకులు గొట్టికాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, గ్రామస్తులు పంచాయతీ పరిశుభ్రత కు తీసుకోవలసిన సూచనలు, సలహాలు అందించారు .
గాంధీ జయంతి నీ పురస్కరించుకొని సీనియర్ సిటిజన్ లను,పారిశుధ్య కార్మికులను వైకాపా నాయకులు రవీంద్రారెడ్డి పూలమాలలు,శాలువాలతో సన్మానించి,సత్కరించారు.
 భవిష్యత్తులో మొలకలపూడిని మండలంలో పరిశుభ్రత కలిగిన పంచాయతీగా నిలిపేందుకు తమ వంతు కృషి చేస్తామని రవీంద్రారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి, స్థానిక వైకాపా నాయకులు ,పలువురు పాల్గొన్నారు .