తేది:09-08-2021
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, మల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*మల్లూరు గ్రామంలో గ్రామ సచివాలయ భవనం, సిమెంటు రోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.*

*సంచార జాతుల కుటుంబాలకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి*

*స్క్రోలింగ్ పాయింట్స్:*

👉జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుంది.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో 310 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయించి, గ్రామాలలో పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు నిర్మించాం.

👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తేదీ నాడే, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, రేపటి రోజున చేనేత కుటుంబాలకు *"నేతన్న నేస్తం"* కార్యక్రమం కింద 24 వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తున్నారు.

👉 గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడంతో, తెలుగుదేశం నాయకులు కడుపు మంటతో భరించలేకపోతున్నారు.

👉 సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తూ, అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా.