పులివెందుల రౌడీయిజం నశించాలి.

మహిళల పై దాడులను అరికట్టాలి, మహిళలకు రక్షణ కల్పించాలి.
-------
దిరిశాల రేవతి ,
నగర తెలుగు దేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు.

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలపై దాడులు అధికమయ్యాయని, ఈ దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు దిరిశాల రేవతి అన్నారు. ఆమె శుక్రవారం సాయంత్రం మినీ బైపాస్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే ,సావిత్రి బాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల నెల్లూరులో టూరిజం శాఖ లో పనిచేస్తున్న  వికలాంగురాలైన మహిళ ఉద్యోగిపై ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి తీవ్రంగా ఆమెపై దాడి చేసి హింసించిన సంఘటన మరువకముందే స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పులివెందులలో మహిళా వాలంటీర్ పై దాడి జరగడం హేయమైన చర్యగా ఆమె పేర్కొన్నారు. మహిళలపై దాడులు జరుగుతున్న సంఘటనలు హెచ్చు మీరు తున్నాయని వెంటనే ప్రభుత్వం మహిళలపై దాడులు అరికట్టి మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. అలాగే మహిళలపై దాడులకు కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదని ఉపన్యాసాలు ఇస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మహిళలపై దాడులు చేసిన వీరి పై "దిశ "చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మహిళా నేతలు పద్మ, సెల్వి  ,రోజా, రాణి ,అభిదా , శ్రీలక్ష్మి, విజయ ,విద్య, సోనీ ,లీల, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.