కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు

జిల్లాలో పదవి విరమణ పొందిన రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో   గౌరవార్ధం వారిని సన్మానించిన జిల్లా కలెక్టర్ చక్రధర్  బాబు ... ఆత్మకూరు మండల తహసీల్దార్ గా పనిచేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందిన మధుసూదన్ రావును నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల సన్మానించారు.ఆత్మకూరు తహసీల్దార్ మధుసూదన్ రావు ను పూలమాలతో శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సత్కార కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో పాటు  జిల్లా రెవెన్యూ జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ , డాక్టర్  ప్రభాకర్ రెడ్డి ,  డి ఆర్ వో మల్లికార్జున , కలెక్టర్ కార్యాలయ ఏవో రామారావు లు పాల్గొన్నారు..