నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనకొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి  కన్నుల పండుగ గా తెప్పోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి లతో  పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు