96 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు ఒడిశాలో కరోనాను జయించి సంచలనం సృష్టించారు. లోక్నాథ్ నాయక్ అనే సమరయోధుడు కరోనాను జయించారు అని అక్కడి అధికారులు చెప్పారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ప్రభుత్వ ఆధీనంలోని… ఎస్‌యూఎం కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు ప్రాణాంతక వైరస్ నుంచి కోలుకున్నారు అని చెప్పారు.

'నేను అందుకున్న చికిత్స నా అంచనాకు మించింది. వైద్యులు మరియు నర్సులు నన్ను చాలా జాగ్రత్తగా మరియు ప్రేమగా చూసుకున్నారు. వారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా' అని నాయక్ అన్నారు. ఆయనను బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నాయక్ సెప్టెంబర్ 29 న కరోనా బారిన పడ్డారు. జ్వరం, నీరసం, శ్వాస సమస్యలు రావడంతో ఆస్పత్రిలో చేరారు. అతనికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సికెడి) మరియు డయాబెటిస్‌తో సహా ఇతర అనారోగ్యాలు కూడా ఉన్నాయని చెప్పారు.