ల్యాండ్_పూలింగ్ పేరుతో పేదల స్థలాల సేకరణ ను అడ్డుకున్న జనసేన నాయకుల పై కేసులు..
వీరమహిళ నాయకుల ను స్టేషన్ లో నిర్బందం,హమీ పై విడుదల.....
నెల్లూరు జిల్లా , కోవూరు నియోజకవర్గం , కొడవలూరు మండలం , కొడవలూరు అరుంధతీవాడ కుటుంబాలకు సంభందించిన ఇళ్ళ స్థలాలను ల్యాండ్ పూలింగ్ పేరుతో యుశ్రారైకాపా నాయకులు మరియు కొడవలూరు రెవిన్యూ అధికారులు అన్యాయంగా దళితుల భూములను ఆక్రమించి అధికారపార్టీ నాయకులకు , అధికారపార్టీ కార్యకర్తలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిన్న అనగా 13/08/2020 వ తేదీన నెల్లూరు జిల్లా జనసేనపార్టీ యువజనవిభాగం అధ్యక్షుడు గునుకుల #కిషోర్  మరియు జనసేనపార్టీ వీరమహిళ చెంబేటి ఉష గారు అరుంధతీవాడ గ్రామస్తులతో కలసి రెవిన్యూ అధికారులను అడ్డుకోవడం జరిగింది..పేదలకు అండగా ఉంటూ వాళ్ళ యోగ క్షేమాలు చూసుకోవాల్సిన ప్రభుత్వాలు , ప్రభుత్వ అధికారులు దళితులపైన , జనసేనపార్టీ నాయకులపైన కక్ష సాదింపు దోరణితో జనసేన నాయకులు గునుకుల కిషోర్ గారిమీద , జనసేన నాయకురాలు చెంబేటి ఉష గారిమీద , కొడవలూరు అరుంధతీవాడ ప్రజలమీద అధికారపార్టీ నాయకుల ప్రోద్బలంతో కొడవలూరు రెవిన్యూ అధికారులు ఈరోజు అనగా 14/08/2020 వ తేదీన కొడవలూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదుచేయడం జరిగింది..పేదవాళ్ళ కోసం జనసేనపార్టీ న్యాయపోరాటం చేస్తుంటే..అధికారపార్టీ మాత్రం పేదల కడుపు మీద , వారి కష్టాలమీద కొడుతూ లబ్దిపొందుతున్నారు..ఇలాంటి భూటకపు అరెస్ట్ లు జనసేనని బయపెట్టలేవని...బాధితులకు న్యాయం జరిగేవరకు జనసేన పోరాటం ఆగదని..న్యాయపరంగా పోరాటం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని నెల్లూరు జిల్లా జనసేన నాయకులు గునుకుల కిషోర్ బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది..