చుక్కల భూమి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్చార్జి నళిశెట్టి శ్రీధర్ చేస్తున్న పాదయాత్రలో ఆహ్వానం మేరకు జనసేన నెల్లూరు పార్లమెంటరీ ఇన్చార్జి మనుక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చుక్కల భూమి సమస్యను వెంటనే పరిష్కరించాలని, సుమారుగా పరిగణించిన తరువాత కూడా ఈ సమస్య తీరకపోవటం విచారకరమని, చెన్నారెడ్డి మనుక్రాంత్ స్పష్టం చేశారు. బిజెపితో కలవటం శుభపరిణామం అని రాబోయే రోజుల్లో కలిసి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.