నెల్లూరు, డిసెంబర్‌ 22, (రవికిరణాలు) : ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంఘం నెల్లూరు జిల్లా 2వ మహాసభను జనవరి 5వ తేదీన నెల్లూరు కెవిఆర్‌ సమీపంలోని మెడికల్ ఐఎమ్‌ఏ హలు నందు జరగనున్న కార్యక్రమ నేపథ్యంలో దీనికి గాను ముందస్తు ఏర్పాట్లకు గాను ఆహ్వాన సంఘం కమిటీ సమావేశం ఆదివారం శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య భవన్ బోసుబొమ్మలో ఏర్పాటు చేశారు. జరగబోయే మహాసభకు జిల్లాలోని దళిత గిరిజన గెజిటేడ్ అధికారులు అందరూ పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని సలహాలు,సూచనలు ఇవ్వాలని  డిమాండ్లను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ గెజిటేడ్ ఆఫీసర్స్ అసోసియేషన్
రాష్ట్ర నాయకులు పట్టపు శీనయ్య, వై.పరందయ్య బి.వరప్రసాద్, నెల్లూరు జిల్లా నాయకులు పులి చెంచయ్య, రేపల్లె మధు, మాణికల.మహేష్, తదితరులు పాల్గొన్నారు.