కృష్ణా జలాలపై మంత్రి అనిల్ కుమార్ నోరు తెరవాలని పారిపోతే కుదరదని మాజీమంత్రి టీడీపీ రాష్ట్ర నేత దేవినేని ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేసులు, ఎన్నికల ఒప్పందాలు, లాలూచీ వ్యవహారాల కోసం కృష్జా జలాలని తాకట్టుపెట్టడానికి అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో నేరుగా మాట్లాడటానికి ధైర్యం లేకుండా పోయిందని కనీసం రికార్డింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. తెలంగాణాలో అధికారికంగా 150, అనధికారికంగా 300 టీఎంసీల నీరు పోతుందని  దీనిపై అధికారులూ సమాధానం చెప్పకుండా పారిపోతున్నారు. మంత్రి సినిమా టిక్కెట్ల గురించి మాట్లాడుతున్నారని రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై నోరు మెడిపేందుకు మంత్రి అనిల్ కు తీరిక దొరకడం లేదన్నారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.