కొత్తూరు అంబాపురం దగ్గర 6 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, స్మశాన వాటికల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగారెడ్డి మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గార్లు. 🔹 కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలాగా ప్రజలతో సంబంధాలు ఉండేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. 


🔹 31 & 32 డివిజన్లకు ఇప్పటి వరకు 18 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. కానీ ఇంకా చెయ్యాల్సిన పనులు కూడా ఉన్నాయి. వాటిని కూడా త్వరితగతిన పూర్తిచేస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 గౌరవ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషిచేయాలి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 గౌరవ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పూర్తిగా రూరల్ నియోజకవర్గానికి సహకరిస్తున్నారు.  తన ఎమ్.పి. నిధుల నుంచికూడా రూరల్ నియోజకవర్గానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.