నెల్లూరు నగరంలోని కోటమిట్టకు చెందిన స్థానిక స్వర్ణకారులు జలీల్ ఖాన్, రియాజ్, వారి మిత్రబృందం దాదాపు 200 మంది నెల్లూరు నగరంలోని కోటమిట్ట సెంటర్ లో షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారి సమక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఫయాజ్, జమాల్, షౌఖాత్, సాజిద్, రాధాకృష్ణ, తాజుద్దీన్, వెంకటేష్, జాకీర్, తదితరులు పార్టీలో చేరగా, కార్యక్రమంలో ఎం.డి.ఖలీల్ అహ్మద్, హంజా హుస్సేనీ, ఎస్.ఆర్. ఇంతియాజ్, సయ్యద్ సమీ, మునవర్, మీరామొహిద్దీన్, ఎం.డి.తారీక్, బాబా భాయ్, తదితరులు పాల్గొన్నారు.