నెల్లూరు, జనవరి 31, (రవికిరణాలు) : ఫిబ్రవరి 5వ తేదీ నుంచి శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మహాకుంభాభిషేకం ప్రారంభమవుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేఖరుల సమావేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకుంభాభిషేక మహోత్సవంలో ముఖ్యంగా 7వ తేదీన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారి చేతులమీదుగా ఉదయం 8.40గంటలకు మహాకుంభాభిషేకం నిర్వహించబడుతుందని అన్నారు. 23 సంవత్సరముల తరువాత జరుగుతున్నటువంటి మహాకుంభాభిషేకంలో భక్తులందరూ పాల్గొని, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరారు. ఎంతో వ్యయప్రయాసలతో, ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ మహాకుంభాభిషేకానికి ముందుకు వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులకు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులపక్షాన, భక్తులపక్షాన రూరల్ ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.