తెలుగు ప్రజల గుండెచప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి...... వైకాపా నాయకులు కోలా కిరణ్ కుమార్, పూర్ణ....               దివంగత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహావ్యక్తి అని ఆయన ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని వైకాపా నాయకులు కిరణ్ కుమార్, పూర్ణ తెలిపారు. బుధవారం వైయస్ రాజశేఖర్రెడ్డి 71 వ జయంతి సందర్భంగా నగరంలోని స్థానిక రామ్ నగర్ కాలనీ లో వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి భారీ కేకును కట్చేసి ఘనంగా నివాళులు అర్పించారు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఇది తమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రెడ్డి ఇ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీలకతీతంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కన్నా అధికమైన అభివృద్ధి పనులను చేస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారు. వైయస్ జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్ష పార్టీ ఓర్వలేక అభివృద్ధి పనులను  అడ్డుకుంటోందని అన్నారు.. ఏది ఏమైనా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పార్టీలకతీతంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు తమ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తుపాకుల సుధాకర్ నాయుడు ,వాసు బాబు నవీన్ , కిషోర్, ఆర్టీసీ చిన్న, యతిరాజులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు