చిత్తూరు

 విధి నిర్వహణలో ఉన్న తహసీల్దార్​ని కత్తితో పొడిచి చంపాడు ఓ వృద్ధుడు.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం సరిహద్దు ప్రాంతం కర్ణాటక పరిధిలోని కలవంచి వద్ద భూమి సర్వే చేస్తున్న తహసీల్దార్ చంద్రమౌళి గురువారం హత్యకు గురయ్యారు. విధి నిర్వహణలో ఉన్న అతన్ని విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటాచలం కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన తహసీల్దార్​ను సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. హత్యకు భూ వివాదం కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.