దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిరసిస్తూ మండలంలోని 17 సచివాలయాల లో మెమోరండం అందజేస్తున్నట్లు
మర్రిపాడు సిపిఎం నాయకులు మూలి వెంగయ్య తెలిపారు. మర్రిపాడు మండలం లోని తాసిల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

:దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిరసిస్తూ మండలంలోని 17 సచివాలయాల లో మెమోరండం అందజేస్తున్నట్లు మర్రిపాడు సిపిఎం నాయకులు మూలి వెంగయ్య తెలిపారు. మర్రిపాడు మండలం లోని తాసిల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని ఆ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని మా  మొదటి నినాదంగా పేర్కొన్నారు. కార్మిక వర్గ నిర్మూలన చేయడం సరికాదని, కార్మికుల కోసం ప్రత్యేక సంస్కరణలు తీసుకు రావాలని తెలిపారు. కరోనా నేపథ్యంలో పేదలకు బియ్యం, నిత్యవసర వస్తువులు, ఆరు నెలలపాటు 7500 రూపాయల ఆర్థిక భృతిని కల్పించే వాళ్ళని ఆదుకోవాలని సిపిఎం నాయకులు డిప్యూటీ తాసిల్దార్ అనిల్ కుమార్ కు మెమోరండం అందజేసినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి రత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.