మనుబోలు మండలం,కట్టువపల్లి గ్రామంలో  అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు* ...
 వైసిపి యువ నాయకులు గుండాల ఆదినారాయణ , సన్నారెడ్డి జానకిరాం రెడ్డి గార్ల సమక్షంలో చే గువేరా ఫౌండేషన్,మన ఊరు మన బాధ్యత మరియు KPF టీం ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ దినాన గ్రామంలో పలు సాంసృతిక కార్యక్రమలు, ఆటల పోటీలు, నిర్వహించారు
ఈ కార్యక్రమంలో భాగంగా,  ముగ్గుల పోటీలో గెలుపొందిన...మొదటి నలుగురు మహిళలకు పట్టుచీరలను పంపిణీ చేయడం జరిగింది ..
గెలుపొందని ఇతర మహిళలో  క్రీడాస్ఫూర్తి నింపేందుకు గాను....పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు అందజేయడం జరిగింది..అదేవిధంగా.....కుర్చీల ఆట మరియు లెమన్ & స్పూన్ ఆటల్లో గెలుపొందిన విజేతలకు కప్పులు మరియు బాక్సులను అందజేయడం జరిగింది. గ్రామంలోని యువకులకు కబడ్డీ, మరియు వాలీబాల్ నిర్వహించి అందులో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు .అనంతరం సాంసృతిక కార్యక్రమంలో గ్రామ  ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈకార్యక్రమాలను నిర్వహించిన చేగువేరా ఫౌండేషన్ అధ్యక్షుడు, వైసీపీ యువ నాయకులు గుండాల ఆదినారాయణ కు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.