*కాకాణి చేతులు మీదుగా "స్టాండు మగ్గాలు" పంపిణీ*

తేది:10-07-2021
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కసుమూరు గ్రామంలో చేనేత కుటుంబాలకు స్టాండు మగ్గాలను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసుమూరు దర్గాకు విచ్చేయు భక్తులకు, కొండపైన "మస్తానయ్య పాదాలు" ప్రాంతంలో నిర్మిస్తున్న నూతన వసతి గృహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి.*

*వెంకటాచలం మండలం పరిధిలో 112 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సదుపాయం తదితర వసతులు కల్పించినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే కాకాణి.*

*కసుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 9 కోట్ల రూపాయలతో సిమెంటు రోడ్లు, సైడ్ డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించామని వివరాలతో సహా వెల్లడించిన ఎమ్మెల్యే కాకాణి.*

*స్క్రోలింగ్ పాయింట్స్:*

👉 చేనేత కుటుంబాలకు రూ.15,86,700/-ల విలువైన 66 స్టాండ్ మగ్గాలను  అందించే భాగ్యం కలగడం నా అదృష్టం.

👉 వర్షాకాలంలో మగ్గాల గుంతల్లో నీరు చేరినప్పుడు కుటుంబ పోషణ కొరకు, చేనేత పనులు ఆగిపోకుండా ప్రత్యామ్నాయంగా స్టాండ్ మగ్గాలను అందించాం.

👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకు పెన్షన్ అందించడంతో పాటు, *"నేతన్న నేస్తం"* పేరిట క్రమం తప్పకుండా సంవత్సరానికి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

👉 యావత్తు కుటుంబం పని చేస్తే గాని పొట్ట నింపుకోవడానికి అవకాశం లేని చేనేత కుటుంబాల పట్ల, సానుభూతితో పాటు, సంపూర్ణ సహాయ, సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం.

👉 చేనేత కుటుంబాలకు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, రుణమాఫీ అమలు చేయకుండా, చేనేత కుటుంబాలను నిట్ట నిలువునా మోసం చేశాడు.

👉 చేనేత కుటుంబాలలో ఆత్మహత్యలు నివారించడానికి పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, అధికారంలోకి వచ్చాక నేతన్నలకు అండగా నిలిచారు.

👉 చేనేత వృత్తి తప్ప, మరొకటి చేయడానికి ఇష్టపడని చేనేత కుటుంబాలు విషాదాన్ని తమలో దాచుకొని, అలంకారమైన రంగురంగుల వస్త్రాలను సమాజానికి అందిస్తున్నారు.

👉 చేనేత కుటుంబాలకు శ్రమకు తగ్గ ఫలితం కోసం, నేతన్నలను ఆదుకునేందుకు నా శాయశక్తులా కృషి చేస్తా.