సేవాదృక్పథంతో
ముందుకు దూసుకెళుతున్న
కావలి బృందావనం కాలనీ వాసులు
-----------------------------------------------
కరోనా మహమ్మారీని ఎదుర్కొనేందుకు  ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ లో ముఖ్యంగా పేద , మధ్యతరగతి కుటుంబీకులు ఎన్నో కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే .
ఈ క్లిష్ట సమయంలో పేద ప్రజల్ని ఆడుకోడానికి - కొండబిట్రగుంట దేవస్థానం చైర్మన్ శ్రీరాం మాల్యాద్రి సారధ్యంలో కావలి బృందావనం కాలనీ వాసులు లక్షలాది రూపాయలు వెచ్చించి నిత్యావసరవస్తువులు , కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది . 
10 వతేది ఆదివారం  ఉదయం బృందావనం కాలనీ వాసులు 76 మంది వలస కూలీలకు , లారీ డ్రైవర్లకు ఉపాహారం , త్రాగునీరు  అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు  . అలాగే సాయంత్రం 300 మందికి సాంబారు కలిపిన భోజనం ప్యాకెట్లు మరియు త్రాగునీరు ప్యాకెట్లు వలస కూలీలకు , లారీ డ్రైవర్లకు అందించడం జరుగుతుందని ,
బృందావనీ కాలనీ వాసులు అందిస్తున్న సహకారంతోనే ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నామని శ్రీరాం మాల్యాద్రి వెల్లడించారు .
 కావలి పట్టణ ప్రజానీకం బృందావనం కాలనీ వాసుల
 సేవల్ని కొనియాడుతుంది .