కరకట మల్లికార్జున అక్రమ అరెస్ట్ ను ఖండించిన పోలంరెడ్డి..


కొడవలూరు మండల వైసీపీ నాయకుల దూరగతాలను ప్రోత్సహిస్తున్న M.L.A ప్రసన్న కుమార్ రెడ్డి .


కొడవలూరు మండలంలో ఏ దళిత నాయకుడు ఎదిగినా  తట్టుకోలోని వైసీపీ నాయకుడు.


కొడవలూరు మండలం లోని నార్త్ రాజుపాలెం చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కరకట మల్లికార్జున గారిని ఈ రోజు ఉదయం స్థానిక వైసీపీ నాయకుడు కి చెందిన అనుచరులు దారుణంగా కొట్టి ఆటోలో ఎక్కించుకుని బలవంతంగా తీసుకుని వెళ్ళడం జరిగింది. తరువాత పోలీసులకు అప్పగించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదుగుతూ దళిత వర్గాల లో నాయకుడు గా ఎదుగుతున్న కరకట మల్లికార్జున చూసి తట్టుకోలేని స్థానిక వైసీపీ నాయకుడు . అతని అంతం మోదించే కుట్ర చేస్తున్నాడు. దీనికి స్థానిక శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రోత్సాహం అందిస్తున్నాడు. పోలీసు శాఖ వారు అండ దండ గా ఉన్నారు. ఈ దుర్మార్గమైన అక్రమ అరెస్టు ని ఖండిస్తూ కరకట మల్లికార్జున గారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను.


ఇదే కొడవలూరు పోలీసు స్టేషన్ లో గడిచిన నెల రోజుల కాలంలో రాజుపాలెం చెందిన ఉబ్బాని శీనయ్య, కొత్తవంగల్లు చెందిన దళిత గ్రామస్తులు ,గుర్రాల దీన్నేకి చెందిన మాదిగ కులస్తుడి ని ,అదే విధంగా రాజుపాలెం పట్టణా నికి చెందిన 15 మంది దళిత యువకులని దారుణంగా కొట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కొట్టకూడదనే చట్టం ఉన్న  ఇక్కడ s.i గారు ఎవరి మెప్పు కోసం కొడుతున్నారో అర్థంకాని పరిస్థితి తయారైంది.


ఇక్కడ జరుగుతున్న సంఘటనలు బట్టి కోవూరు శాసనసభ్యుడు ప్రసన్నకుమార్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలిపోతాడు.  కలెక్టర్ గారు , sp గారు వెంటనే స్పదించి కరకట మళ్ళీకార్జున గారి మీద హత్యాయత్నం చేసిన వారి మీద  కేసు నమోదు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము.  లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఉద్యమం తలపెడుతాం. మా కార్యకర్తలని కాపాడుకొంటాం. మరోసారి ఇలాంటి వి జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం.

   

మీ 

పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి 

మాజీ శాసనసభ్యుడు

కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి