6వ తేదీ మొదలు కాబోతున్నశ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర కోవిడ్ నిబంధనలు కు అనుగుణంగా  ఏర్పాట్లు పూర్తి..వెల్లడించిన ఆలయ ఛైర్మెన్ వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి,E.Oయూ జనార్దన్ రెడ్డి


👉ప్రతి సంవత్సరం ఉగాదికి ముందర వచ్చే మంగళవారం నుండి శుక్రవారం వరకు అమ్మవారి జాతర మహోత్సవం


👉గత సంవత్సరం కూడా కోవిడ్ దృష్ట్యా జాతర ను నిలిపివేసిన అధికారులు కు ఈ సంవత్సరం కూడా కోవిడ్ సెకండ్ వేవ్ తో షరతులు తో కూడిన అనుమతులు మంజూరు


👉అమ్మ వారి పూజా కైంకర్యాలు యధావిధిగా జరుగుతాయి,ఆలయానికి వచ్చే భక్తులు  కోవిడ్ నిబంధనలు పాటించి మాస్క్ లు ధరించి,సామాజిక దూరం పాటించండి..భక్తులకు ఆలయ అధికారులు విజ్ఞప్తిఈరోజు చిల్లకూరు మండలం లో వెలసియున్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి  జాతర మహోత్సవం కి సంబంధించి వివరాలు వెల్లడించిన ఆలయ చైర్మన్ మరియు దేవాదాయ శాఖ అధికారులు,కోవిడ్ నిబంధనలుకు లోబడి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉగాదికి ముందు మంగళవారం నుంచి శుక్రవారం వరకు జరిగే కనుపూరు శ్రీ ముత్యాలమ్మ  జాతరకు చుట్టుపక్కల గ్రామాలు మాత్రమే హాజరు కావాలని బయటి ప్రాంతాల ప్రజలు జాతరకు అనుమతులు లేవని కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశామని కావున ప్రజలు కూడా అర్థం చేసుకొని ఆలయానికి వచ్చే వారు అందరూ మాస్కులు ధరించి కోవిడ్ నియమాలు పాటించాలని ఆలయ చైర్మన్  మురళి మోహన్ రెడ్డి కోరారు... అలాగే ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో లో కనుపూరు జాతర మహోత్సవానికి సంబంధించి రెండుసార్లు  అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కోవిడ్ దృష్ట్యా నిబంధనలకు అనుగుణంగా జాతర జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశారని కావున ఈసారి భక్తుల సంఖ్య లో కూడా పరిమితులు ఉన్నాయని కాబట్టి ప్రజలు అర్థం చేసుకుని నియమాలు పాటిస్తూ అమ్మవారి దర్శనానికి రావాలని ఈవో జనార్దన్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు సాయి కృష్ణా రెడ్డి,గౌడ్ తదితరులు పాల్గొన్నారు...