కట్టా వెంకట రమణారెడ్డి దాతృత్వం.
15 వేల కోడిగుడ్లు పంపిణీ.
కరోనా మహమ్మారి విజృబించి పేదలు ఇబ్బంది పడుతున్న తరుణంలో నాయుడుపేట పట్టణం తోపాటు మండలంలో స్థానికి వైసీపీ నాయకులు,దాతలు పలురకాల నిత్యావసరాల వసతులు ఉచితంగా అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపు మేరకు రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కట్టా వెంకట రమణారెడ్డి ఆర్ధిక సహకారంతో నాయుడుపేట పట్టణంలోని 1450 కుటుంబాలకు సుమారు 15 వేల కోడిగుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు కరోనా కష్ట కాలంలో పేదలకు తమవంతు సహాయం చేయడం అభినదనీయం అన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించి లాక్ డౌన్ కు సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి,షేక్ రఫీ,కిశోర్ యాదవ్,మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.