నవంబరు 20, 2020
సీఎం క్యాంపు కార్యాలయం

*తిరుపతి దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబాన్ని రాజకీయంగా అన్నివిధాలా ఆదుకుంటామని సీఎం శ్రీ జగన్ చెప్పారుః మంత్రి  బొత్స సత్యనారాయణ*
- ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారిని క్యాంపు కార్యాలయంలో కలిసిన బల్లి దుర్గా ప్రసాదరావు భార్య, కొడుకు కళ్యాణ్ చక్రవర్తి. ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి శ్రీ జగన్ హామీ. 
- తిరుపతి దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవిః మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన
- శాసన మండలిలో మొదట ఏ స్థానం కాళీ అయితే.. ఆ స్థానంలో కళ్యాణ్ చక్రవర్తిని ఎమ్మెల్సీని చేస్తాం..
- తనతోపాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో బల్లి కళ్యాణ్ చక్రవర్తి నడవాలన్నది సీఎం శ్రీ జగన్ గారి అభిమతం, ఆకాంక్ష.

*శ్రీ జగన్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాంః బల్లి కళ్యాణ్ చక్రవర్తిః*
- నాన్న కోవిడ్ కు గురైన దగ్గర నుంచి.. ఆ కష్టకాలంలో ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు ప్రతి విషయంలోనూ మాకు అండగా నిలిచారు. ఎమ్మెల్సీ స్థానం కాళీ అయిన వెంటనే మొదటి స్థానం తనకు ఇస్తానని సీఎం శ్రీ జగన్ హామీ ఇచ్చారు.  శ్రీ జగన్ గారికి మా కుటుంబం మొత్తం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
- తన తండ్రి స్థానంలో కాళీ అయిన ఎంపీ ఉప ఎన్నికలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయం సాధించడానికి కృషి చేస్తాం.