కాళంగి నదిలో ఓ కారు బోల్తా.

నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-
జాతీయరహదారిపై కాల్లంగి నదిలో రాత్రి ఓ కారు బోల్తా కొట్టిన సంఘటన కలకలం రేపింది. నదిలో కారు పడిన సంగతి పోలీసులకు సమాచారం అందడం తో సంఘటన  స్థలం కు చేరుకొని ప్రమాదం జరిగి ఉన్న తీరును చూసి అవాక్కయ్యారు, నది పై ఉన్న రెండు బ్రిడ్జ్ ల మధ్య నుండి  కారు నదిలోకి బోల్తా కొట్టి ఉంది, ఇక వివరాల్లోకి వెళితే సూళ్లూరుపేటకు చెందిన ఆనంద్ అనే వ్యక్తి తన కారును  మన్నారుపోలూరు లోని షఫీ అనే వ్యక్తికీ సంబందించిన కారు వాటర్ సర్వీస్ సెంటర్లో కారును సర్వీసుకు ఇచ్చాడు సర్వీస్ సెంటర్లో పనిచేసే యువకులు ముగ్గురు ఈ కారును తీసుకొని వెళ్లి మద్యం సేవించి తిరిగి కారును సర్వీస్  సెంటర్లో పెట్టడానికి వెళుతూ అతివేగంగా వెళ్లి బ్రిడ్జ్ ను ఢీకొట్టడం తో కారు రెండు బ్రిడ్జ్ మధ్య నుండి కాళంగి నది  లోకి బోల్తా కొట్టినట్లు తెలుస్తుంది, కారులోని వారికి ఎలాంటి గాయాలు కాకపోవడం తో ప్రమాదం జరిగిన వెంటనే  కారును వదిలేసి యువకులు అక్కడ నుండి పరారైయ్యారు. పోలీసులు రంగం లోకి దిగి సంఘటన వివరాలను , కారకులను గురించి పూర్తి  సమాచారం సేకరిస్తున్నారు.