కావలి రూరల్ మండలం చెన్నాయపాళెం కి చెందిన బాధితురాలు పొన్నాతి వెంకమ్మ  స్ధానిక జర్నలిస్టు క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.  

 మా పట్టా భూమి  సర్వే నెం.219/2, 220.221ర్ల నందు మాగాణి పొలమునందు గత 20సం॥లుగా మామిడి మొక్కలు  వేసుకుని జీవనాధారం చెందుతున్నామని, కొన్ని రోజుల నుండి నన్నిబోయిన వ్రసాదు S/O నందీశ్వర్లు, నక్క రామకృష్ణ  S/O మాలకొండయ్య, నక్కా మాల కొండయ్య S/O లింగయ్య అను వారలు వారి పొలములోనికి రోడ్డు వేసుకొవటానికి మా పొలమును అడిగారని. మేము మా పొలాన్ని ఇవ్వటానికి నిరాకరించినందు వలన మొన్నటి రాత్రి అనగా తే.30-09-2020దిన అర్థరాత్రి సమయంలో జె.సి.బి. ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళి మామిడి మొక్కలను  వేర్లుతో సహా లేవ దీసికొని వెళ్ళి ప్రకాశం జిల్లా, చేవూరు చెర్లో పడవేసినారన్నారు.

మా పొలము నుండి రోడ్డు వేయటానికి నిరాకరించినందున మా పొలములోనికి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యంగా మామిడి మొక్కలను వేళ్లతో సహా పెరికిన వారిపై చట్ట పరమైన చర్యలు  తీసుకుని, సదరు వ్యక్తుల వల్ల మాకు నష్టపరిహారం చెల్లించి మాకు న్యాయం జరపించవలసినదిగా కోరుతున్నామన్నారు. 

అనంతరం భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 70 సంవత్సరాలు కలిగిన ముసలమ్మను కూడా చూడకుండా అధికార బలంతో వారి యొక్క పొలాలకు దారి ఇవ్వాల్సిందిగా బలవంతం చేయడంతో దానికి వెంకమ్మ వారికుమారులు నిరాకరించి కోర్టు నందు తేల్చుకునేందుకు సన్నద్దం మవుతున్న తరుణంలో అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ జెసిబిలతో వారి రహదారికి అడ్డుగున్న చెట్ల వరకు అనగా 8 చెట్లను పెకలించడం దారుణమని అన్నారు.  గత 20 సంవత్సరాలుగా మామిడి చెట్లు సాగుచేసుకుంటూ జీవనాధారం పొందుతుందన్న వారి కుటుంబానికి తక్షణ న్యాయం జరిగేలా పోలీసులు, పాలకులు చర్యలుతీసుకోవాలని భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. వారికి సరైన న్యాయం జరగని పక్షంలో భారతీయ జనతాపార్టీ రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు.