కరోనా బాధితులకు అత్యున్నత సేవలు అందించాలి
జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి

జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్స్, క్వారంటైన్ సెంటర్స్ లలో కరోనా బాధితులకు అత్యున్నత సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జిల్లా ఎమర్జెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వీసీ అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ కరోనా బాధితులకు అందించే భోజనం శానిటేషన్ వంటి విషయాల్లో ఎలాంటి రాజీ పడవద్దన్నారు. ప్రతి సెంటర్ లో మెరుగైన వసతులు కల్పించాలన్నారు. భోజనం, శానిటేషన్ కి సంబంధించి ఏమైనా బకాయిలు ఉంటే వెంటనే వాటిని మంజూరు చేయాలన్నారు. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నుడా వైస్ చైర్మన్ నవ్య, జిల్లా సహకార అధికారి తిరుపాల్ రెడ్డి, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మణికుమార్, జిల్లా సివిల్ సప్లై అధికారి బాలకృష్ణ, తెలగన ప్రత్యేక కలెక్టర్ నాగ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు