మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రబాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి అనంతపురం చేసుకున్నారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగాల కేసులో ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కోసం కడప సెంట్రల్‌ జైలు నుంచి అనంతపురానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల కోసం ఇద్దరని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని విచారిస్తారు. న్యాయవాదులు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇద్దరిని విచారిస్తారు. ఇటీవల శంషాబాద్‌లో ప్రభాకర్‌రెడ్డితో పాటు అస్మిత్ ‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.