పది రంగాలలో భారీ ఎత్తున పెట్టుబడులకు జపాన్ సంస్థలు సిద్ధం : పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అమరావతి, జూన్,30 ; పది కీలక రంగాలలో భారీ ఎత్తున పెట్టుబడులకు జపాన్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో జపాన్ సంస్థలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో జపాన్ కు చెందిన బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (JBIC) , జపాన్ ప్రీమియర్ ఫినాన్సియల్ ఇన్స్టిట్యూషన్, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (JICA), ప్రీమియర్ జసాన్ డెవలప్ మెంట్ ఏజెన్సీ, కునియమి ఎసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ లిమిటెడ్ సంస్థలు సుముఖంగా ఉన్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

జపాన్ సంస్థలు భారీఎత్తున పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్న 10 రంగాలు :

1. ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయల కల్పనలో భాగంగా .. పోర్టుల నిర్మాణం, ఓడరేవుల ద్వారా సరకు రవాణా., పోర్టు ఆధారిత క్లస్టర్ డెవలప్ మెంట్, ఇండస్ట్రియల్ క్లస్టర్ల అభివృద్ధిలో  భాగస్వామ్యం
2. సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు : సోలార్ విద్యుత్ పార్కుల ఏర్పాటుకు తోడ్పాటు
3. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి : చేపలు, రొయ్యల వంటి ఆక్వాకల్చర్  తరహా వృద్ధికి, ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ల ఏర్పాటులో పెట్టుబడులకు సంసిద్ధత.
4. స్మార్ట్ నగరాల అభివృద్ధి : స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు అవపరమైన మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సహకారం; పట్టణాభివృద్ధిలో  భాగంగా APUIAML (Andhra Pradesh Urban Infrastructure Asset Management)తో భాగస్వామ్యం.
5. పట్టణాల పునరుద్ధరణకు కీలకమైన ప్రణాళిక, అభివృద్ధిలో తోడ్పాటు
6. భావితరాల కోసం విశాఖ కేంద్రంగా పెవిలియన్ ప్రాజెక్టు : అమరావతిలో నిర్మించాలనుకున్న ఈ ప్రాజెక్టును విశాఖలో ఏర్పాటు చేసేందుకు సిద్ధం. పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్, కమర్షియల్ , రెసిడెన్షియల్ అవసరాలకు , అభివృద్ధికి అనుగుణంగా బహుళ ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటుకు అంగీకారం.
7. సుస్థిరాభివృద్ధి  : విద్య రంగలో వసతులు, వైద్య సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధికి అవసరాలకు అనుగుణంగా విశాఖ కేంద్రంగా ఐ.టీ హబ్ మార్చేలా నైపుణ్య కేంద్రం ఏర్పాటు, తద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరడం.
8. ఎగుమతులు : రొయ్యలు, చేపలు, వ్యవసాయ అనుబంధ శుద్ధి పరిశ్రమల  నుంచి జపాన్ మార్కెట్లకు ఎగుమతులు
9. నిధుల సమీకరణ : అంతర్జాతీయ మార్కెట్ల స్థాయిలో జేబీఐసీ (జపాన్  బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్) క్రెడిట్ రేటింగ్ తో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి.
10. పెట్టుబడులు : జపాన్ సంస్థలు సహా ఇతర విదేశీ పెట్టుబడులను ఏపీకి వెల్లవలా వచ్చేలా చేసేందుకు సాయం.
* పెట్టుబడులు,స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు, విశాఖలో ఏర్పాటు చేయనున్న స్కిల్సెంటర్ (ఐ.టీ , హై ఎండ్),  ఐ.టీ, పారిశ్రామిక క్లస్టర్లు, పోర్టులు, మౌలిక సదుపాయాల కల్పనలో సహకారం.

పరిశీలనలో ఉన్న మరిన్ని ప్రాజెక్టులు (ప్రాథమిక దశ) :

1. రామాయపట్నం పోర్టు,  దాని ద్వారా సరకు రవాణా,  పోర్టు కేంద్రంగా ఇండస్ట్రియల్ క్లస్టర్ అభివృద్ధి
2. విశాఖపట్నం సమీపంలోని నక్కపల్లి ఇండస్ట్రియల్ నోడ్
3. 10 వేల మెగా వాట్ల సామర్థ్యమున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు
4. విశాఖపట్నం అభివృద్ధి : మౌలిక వసతులు, రియల్ ఎస్టేట్


వీడియో కాన్ఫరెన్స్ లో  మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎంవో కార్యదర్శి పీవీ.రమేశ్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికరికాల వలవన్  , ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,  మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామల రావ్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రమణ్యం జవ్వాది, డైరెక్టర్ జపాన్ బ్యాంకు ప్రతినిధుల బృందం పాల్గొన్నారు. జపాన్ కు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు,  జేబీఐసీ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ టొషియో ఒయా,  ఎన్విరాన్ మెంటల్ ఫినాన్స్ డివిజన్ కు చెందిన  టెరియుకి వటనబె,  కుని ఉమి  ఎసెట్ మేనేజ్ మెంట్ సంస్థ సీఈవో యసుయో యమజకి, కెయిజి ఇటో, , కన్సల్టెంట్ అకి ఇచిజుక, స్పెషల్ అడ్వైజర్, మొటొమచి ఇకావ , తదితరులు పాల్గొన్నారు.