రోజూ చంద్రమోహన్ రెడ్డిని తిడితే మీ నోటి దూల తీర్చుకోవడం తప్ప..రైతుల కష్టాలు తీరవు..మమ్మల్ని ఎన్నైనా తిట్టుకోండి..కనీసం రైతుల కష్టాలు తీర్చండి..
తోటపల్లి గూడూరు మండలం ఇస్కపాళెం పొలాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ధాన్యం అమ్ముకోవడానికి పడుతున్న ఇబ్బందులు, జరుగుతున్న నష్టాన్ని వివరించి ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదని అన్నదాతల ఆవేదన..
సోమిరెడ్డి కామెంట్స్
ధాన్యం కొనుగోళ్ల విషయంలో గతంలో ఎప్పుడూ లేని పరిస్థితులను చూస్తున్నాం..
రైతులకు పెట్టుబడులు కూడా రాని దుస్థితి..కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత అయోమయం..
ఓ వైపు పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోగా మరోవైపు దిగుబడులు దారుణంగా పడిపోయాయి..
జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో ఎడగారు పంట సాగు చేస్తే సగటున కనీసం మూడు పుట్లు కూడా పండలేదు..
పుట్టి స్వరూపాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా తిరగరాసింది..
840 కిలోలకు గాను ఒక టన్ను(వెయ్యి కిలోలు) ఇచ్చినా చాలడం లేదు..1150 కిలోల వరకు తీసుకుంటున్నారు..
రైతులు ధాన్యం తీసుకెళ్లిన ట్రాక్టర్లు, లారీలను మిల్లుల వద్ద మూడు, నాలుగు రోజులు పడిగాపులు కాయిస్తున్నారు..వాటి బాడుగల భారం రైతులపైనే పడుతోంది...
రైతుల దీనావస్థను ఓ పత్రికలో చదివిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించి ఎఫ్.సీ.ఐ ద్వారా కొనుగోలుకు కూడా అవకాశం కల్పించారు..
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది..
పారా బాయిల్డ్ రైసుమిల్లులను ఆడించలేకపోతున్నారు..ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతుకు చెల్లించకుండా మీరు ఎన్ని టన్నులు కొంటే ఎవరికి ఉపయోగం..
అనుమతించిన మేరకు 17 శాతం తేమ ఉన్నప్పటికీ మద్దతు ధర చెల్లించకుండా అదనంగా 150, 200 కిలోలు ధాన్యం తీసుకుంటే రైతులు ఏమైపోవాలి..
2018లో ఎకరాకు 4 పుట్ల పంట పండింది...బీపీటీల్లో విరుగుడు వస్తుందంటే పుట్టికి రూ.1700 బోనస్ చెల్లించాం..
నెల్లూరు జిలకర ధాన్యానికి గ్రేడ్ సమస్య వచ్చి మిల్లర్లు పుట్టికి 40 కిలోల అదనంగా తీసుకుంటుంటే ఆ భారం రైతులపై పడకుండా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడికి వివరించి ప్రత్యేక జీఓ తెచ్చాం...
అప్పుడు పుట్టికి 40 కిలోలు అదనంగా తీసుకుంటుంటేనే ఆ భారాన్ని ప్రభుత్వమే భరించేలా చేశాం..
ఈ రోజు 200 నుంచి 250 కిలోల వరకు తీసుకుంటుంటే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు...
ప్రధానంగా ఎక్కువ పంట సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల్లోనే ఉంది...నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కావలి ప్రాంతాల్లో కొంత మేర పంట సాగయింది..
ఈ రెండు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు సీనియర్లే..రైతుల సమస్యపై మంత్రుల దగ్గరకు వెళ్లి చర్చించేందుకు వీళ్లకు అవమానం..
ముఖ్యమంత్రి, మంత్రులతో చర్చించి రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు ప్రయత్నించడంలో వచ్చిన ఇబ్బందేంటో..
ప్రతి రైతు పుట్టికి ఆరేడు వేల రూపాయలు నష్టపోతున్నారు...ఎకరాకు 20 వేల నుంచి 25 వేల రూపాయల వరకు కోల్పోతున్నారు..
ఇంత నష్టపోతున్న రైతులకు కనీసం ఎకరాకు రూ.15 వేలు నష్టపరిహారం ఇప్పించండి..
సీఎం దగ్గరకు వెళ్లి మాట్లాడి రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు మీకు ఏమి ఇబ్బంది..అలా వెళ్లడం అవమానంగా భావిస్తున్నారా..
అంతా బాగున్నప్పుడు ప్రజలకు రాజకీయ నాయకులు అవసరం లేదు...కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడే సత్తా చూపాలి..
రోజూ మాపై నోరు పారేసుకుని, నోటికొచ్చినట్టు తిడితే సమస్యలు పరిష్కారం కావు..
ప్రతిపక్షంలో ఉన్నా మమ్మల్ని తిడితిరి..ఇప్పుడు అధికారంలో ఉన్నా మమ్మల్నే తిడుతుంటిరి...
రోజూ చంద్రమోహన్ రెడ్డిని తిడితే మీ నోటి దూల తీర్చుకోవడం తప్ప..రైతుల కష్టాలు తీరవు..

మమ్మల్ని ఎన్నైనా తిట్టుకోండి..కనీసం రైతుల కష్టాలు తీర్చండి..ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోని మీరు సిగ్గుతో తలదించుకోవాలి..