జాతీయ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లిన మహానేత  వైయస్సార్ అని పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్ తెలిపారు. నగరంలోని ఇందిరా భవన్ లో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కేంద్ర పథకాలైన 108 ఆరోగ్యశ్రీ తదితర సేవలను ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తమ పథకాలుగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్మోహన్రెడ్డి రైతులకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. అనంతరం పిసిసి జిల్లా అధ్యక్షులు దేవ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మానసపుత్రుడు వైయస్సార్ అని తెలిపారు. రాహుల్  గాంధీని ప్రధానిగా చేయడమే ఆశయంగా భావించారన్నారు.