సినీనటి రష్మిక మందన్నా ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా విరాజ్‌పేటలోని రష్మిక మందన్నా ఇంట్లో ఈ సోదాలను ఐటీ అధికారులు నిర్వహిస్తున్నారు. ‘గీత గోవిందం’ సినిమాతో రష్మికకు టాలీవుడ్‌లో తిరుగు లేకుండా పోయింది. తాజాగా ఆమె నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ టాక్‌తో ప్రదర్శింపబడుతోంది
 ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన రష్మిక నటించింది. తెలుగుతో పాటు కన్నడ చిత్రాల్లోనూ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. సరిగా ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్నట్టు తెలుస్తోంది