దళిత భూములలో దళితులకె నివాస స్థలాలు ఏర్పాటు చేయాలి....!!ప్రపంచ మానవ హక్కుల సంఘం చైర్మన్ సుబ్బారెడ్డి....
నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం పొంగురు గ్రామంలో, ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో గత రెండు రోజుల కిందట రెవెన్యూ అధికారులు కు,గ్రామస్తులు కు,మధ్య వివాదం నెలకొన్న విషయం తెల్సిందే....
ఈ సంఘటన పై ఈ రోజు పొంగురు గ్రామంలో క్షేత్ర స్థాయిలో వెళ్లి బాధితులు తొ మాట్లాడి, ఇళ్ల స్థలాలు ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దాదాపు ముప్పై, నలబై సంవత్సరాలు ఈ భూమి దళితుల అధీనంలో, ఉంది అని, ఈ స్థలం స్మశానవాటికాగా వినియోగించు కుంటున్నారు,అని అన్నారు. ఈ స్థలం లో మాకు(దళితులకు) మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తాము అని అధికారులు తెలపడంతో ఈ  స్థలాన్ని ఇళ్ల స్థలాలు అనుమతి ఇచ్చాము అని,కానీ అధికారులు ఇప్పుడు ఈ స్థలంలో దళితులకు కాకుండా వేరే వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు అని అందువలన గ్రామంలోని దళితులు ,అడ్డుకున్నారు అని అన్నారు..కావున ప్రభుత్వం, అధికారులు ఈ స్థలం లో దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలిపారు, దళిత స్త్రీ ల పట్ల అసభ్యంగా మాట్లాడిన మండల తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ విషయం పై మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం జిల్లా లీగల్ అడ్వైజర్ నందా ఓబులేసు, జిల్లా వర్కింగ్ చైర్మన్ జ్యోతి శ్రీనివాసులు పాల్గొన్నారు..