హోంగార్డుల 58 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం  వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో మెరుగైన విధినిర్వహణ సేవలు చేసిన హోంగార్డులను గుర్తించి మెమెంటోలు జిల్లా ఎస్పీ అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు