జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు ప్రజలకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తున్న నెల్లూరు పోలీసులు

ప్రామాణికత కలిగిన హెల్మెట్ ధారణ అవసరమని డ్రైవ్ నిర్వహణ

మీ కుటుంబ సభ్యుల కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి

మీకోసం ఎదురు చూస్తూ మీ కుటుంబ సభ్యులు ఉన్నారని మరవకండి.. 

హెల్మెట్ ధరించని వారిపై చట్టప్రకారంచర్యలు తీసుకుంటూ, జరిమానా విధించడం జరుగుతుంది.. 
SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ CH.విజయ రావు,IPS., గారి ఆదేశాల మేరకు ద్విచక్రవాహనాలు నడిపే వాహన చోదకులు ప్రతి ఒక్కరు (బి.ఐ.యస్) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించిన నెల్లూరు పోలీసులు.  

హెల్మెట్ ప్రాణాలకు రక్ష అని, జిల్లాలో సంభవించే రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవటం వలన ఎక్కువగా మరణాలకు గురి అవుతున్నారని తెలియచేసినారు. హెల్మెట్‌ ధరించి ప్రయాణం చేస్తే సురక్షితమని, ప్రమాదాలు జరిగేటప్పుడు హెల్మెట్ అనేది ఒక రక్షణ కవచం లాగా కాపాడుతుందని, ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం మీ జీవితానికి ప్రమాదకరమని, హెల్మెట్ ధరించడం వలన కలిగే లాభాలు మరియు ధరించకపోవడం వలన జరిగే అనర్దాలు గురించి ద్విచక్ర వాహన దారులకు అవగాహన కల్పించడం జరిగింది.

ప్రజలు వారి కోసం వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం తప్పనిసరిగా ప్రామాణికత కలిగిన బిఐఎస్" మార్క్ కలిగిన హెల్మెట్లు ధరించాలని తెలియజేసినారు. వాహనదారుల నిర్లక్ష్యం మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు పాలిట శాపంగా పరిణమించకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లాలో హెల్మెట్ ధరించని వాహనదారులపై కేసులు నమోదు చేసి వారిపై ఈ చలానా విధించటం జరుగుతుందని తెలియచేసినారు.