కరోనా యోధులపై పూలవర్షం

విశాఖపట్నంలో కరోనా బాధితులకు సేవలందిస్తున్న ప్రభుత్వ చెస్ట్‌ ఆసుపత్రిపై వాయుసేన పూలవర్షం కురిపించారు. కరోన యోధులకు పూల జల్లులు, పుష్పగుచాలతో తమదైన రీతిలో అభినందనలు వెల్లువెత్తాయి. అనంతరం వైద్యులకు, నర్సులకు, పారమెడికల్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు తూర్పు నౌకదాలం ఏపి ఆఫీసర్ ఇంచార్జి కమాండర్ సంజీవ్ ఇస్సార్ గారు ఫుష్ప గుచ్చాలు అందించారు. ఈ కార్యక్రమంలో చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, ఎఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్.పివి సుధాకర్‌ గారు పాల్గొన్నారు. నేడు సాయంత్రం రెండు యుద్ధనౌకల్లో విద్యుత్ దీపాలు వెలిగించి నేవీ సిబ్బంది కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలపనున్నారు.