*మహాశివరాత్రి నాడు వైసీపీ నేతలు భేటి* 

 *నేదురుమల్లి- శ్రీమంతుడు భేటి వెనుక రహస్యం..ఏమిటి?* 

 *ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ రాకతో  వేడిక్కిన రాజకీయాలు* 

*ఎమ్మెల్యే వెలగపల్లి పై తిరుగుబాటుకు రంగం సిద్ధమా..?* 

*వెలగపల్లి V  శ్రీమంతుడు మధ్య మాటల యుద్ధం* 

 *గూడూరులో  వైసీపీ వర్గపోరు తీవ్రం* 

*ఎమ్మెల్యే పై గుర్రుగా ఉన్న వైసీపీ నేతలు* 

గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్ నియామకం జరిగేనా..?* 

ఇంచార్జ్ రేసులో నేదురుమల్లి, కనుమురు ఉన్నట్లు గుసగుసలు* 

నేదురుమల్లి, కనుమూరు,బల్లి భేటి వెనుక ఆంతర్యం ఏమిటి..?* 

  శివరాత్రి మహోత్సవాలు గురువారం ప్రారంభం కావడంతో శివలయాలలో శివనామస్మరణతో మార్మోగుతున్న తరుణంలో వాకాడు లోని నేదురుమల్లి ఇంట రాజకీయ నాయకులు భేటి కావడంతో ఈ భేటి వెనుక మతలబేంటి అనీ సర్వత్రా ఉత్కంఠ భరితంగా మారింది.* 
  
 *కారణం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికే నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి,పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి,కొడవలూరు ధనుంజయ్య,వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి, వేమారెడ్డి కుమార్ స్వామి రెడ్డిలు పొరుసాగిస్తున్న తరుణంలో ఇప్పుడు గూడూరు పట్టణానికి చెందిన వైసీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గూడూరు శ్రీమంతుడు కనుమూరు హరిశ్చంద్ర రెడ్డి కూడా చేరారు,* 

 *గత కొంత కాలం నుండి ఎమ్మెల్యే- శ్రీమంతుడు మధ్య అంతర్గత పోరు సాగుతోంది, ఇప్పుడు ఇద్దరి మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి, ఒకరిపై ఒక్కరూ విమర్శలు చేసుకుంటున్నారు,గూడూరు ను ఎమ్మెల్యే భ్రష్టు పట్టిస్తున్నారు అనీ, ఏ పనికి అయినా లంచాలు అడుగుతున్నారు అనీ, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు హరిశ్చంద్ర రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు,అంతటితో ఆగకుండా జాతీయ రహదారిపై నిర్మించిన బస్సు షెల్టర్ కు 10 లక్షలు ఎమ్మెల్యే తీసున్నారు అనీ అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.* 

 *ఎమ్మెల్యే కూడా మీడియా సమావేశంలో హరిశ్చంద్ర రెడ్డి తనకు 10 లక్షలు ఇవ్వలేదు అనీ, అభివృద్ధి కార్యక్రమాలు పై తనతో చర్చకు ఎన్నడూ రాలేదు అనీ ఆయన వెల్లడించారు, ఇంతటితో ఇద్దరు ఆగకుండా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్నటి వరకు గూడూరు పట్టణంలో ఉన్న వైసీపీ నేతలు ఎమ్మెల్యే పై తిరుగుబాటు చేసి విమర్శలు చేసిన నేతలు ఇప్పుడు ఎమ్మెల్యే పంచన చేరి ఎమ్మెల్యే హరిశ్చంద్ర రెడ్డి మధ్య వివాదాలు సృష్టిస్తున్నట్లు పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.* 

 *ఎమ్మెల్యే  వైసీపీ నేతలు మధ్య జరుగుతున్న ఈ పోరు వల్ల మాజీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు కూడా బహిరంగంగా చర్చలు సాగుతున్నాయి, త్వరలోనే గూడూరు పురపోరు వస్తున్న నేపథ్యంలో గూడూరు వైసీపీ పోరు ఏ ప్రమాదానికి దారి తీస్తుందో అనీ వైసిపి నేతలు,కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.  ఈ గొడవలకు ప్రధాన కారణం ఎమ్మెల్యే వెలగపల్లి అనీ ఆయన ఒంటెద్దు పోకడలు వల్ల,ఎవరీ మాట వినని సీతయ్య గా మారడం వల్ల గూడూరు అభివృద్ధి పనుల్లో వైసీపీ నేతలకు సంబంధం లేకుండా ఎమ్మెల్యే తన రూటే సెపరేట్ అన్నట్లుగా వ్యహరించడం వల్ల ఈ సమస్యలు అనీ విశ్లేషకులు భావిస్తున్నారు.* 

 *గూడూరు మున్సిపల్ ఎన్నికల్లో గూడూరు శ్రీమంతుడు కనుమూరు చైర్మన్ రేసులో ఉన్నారు,ఈ తరుణంలో ఎమ్మెల్యే కనుమూరుకి చెక్ పెట్టాలి అనీ యల్లసిరి గోపాల రెడ్డిని తెరపైకి తెచ్చారు, అంతేకాకుండా ఎమ్మెల్యే చెంతకు చేరిన కొంతమంది నేతలు హరిశ్చంద్ర రెడ్డి పై బురదజల్లే ప్రయత్నాలు చేయిస్తున్నారు, అంతేకాకుండా వ్యక్తిగత విమర్శలు సైతం చేయించండం పై హరిశ్చంద్ర రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.* 

 *దింతో హరిశ్చంద్ర రెడ్డి ఎమ్మెల్యే తో తాడోపేడో తేల్చుకోవాలి అనీ గురువారం వాకాడు నేదురుమల్లి స్వగృహంలో తిరుపతి బాపట్లపార్లమెంట్ వ్యహహారాల ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తో హరిశ్చంద్ర రెడ్డి భేటి అయ్యారు, ఈ భేటీలో నూతన ఎమ్మెల్సీ గా ఎన్నికైన బల్లి కళ్యాణ్ కూడా సమావేశం కావడంతో భేటి కాస్త వేడిగా మారింది,ఈ భేటీలో జరిగిన అంశాలు ఏవీ బయటకు రాకుండా జాగ్రత్తలు చేపట్టారు నేతలు,మరి ఈ భేటి వెనుక ఆంతర్యం ఏమిటో..?  వైసీపీ లో వర్గ పోరు ఎలా ఉండబోతోందో...?  ఎమ్మెల్యే పై* *యుద్ధానికి సిద్ధమా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి, అంతేకాకుండా గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్ రేసులో నేదురుమల్లి, కనుమూరి  ఉన్నట్లు కూడా గుసగుసలువినిపిస్తున్నాయి, మరి వైసీపీలో ఏమి జరగబోతుందో పెరుమాళ్ కు ఎరుగా.. లోగుట్టు శివుడు కె ఎరుగా... మహాశివరాత్రి చలి పోయే వేడి ప్రారంభం అయినట్లుగా... వైసీపీలో విమర్శలు పోయి. యుద్ధం మొదలైనట్లుగాకనిపిస్తోంది.*