హోంగార్డు అరుణ్ పై దాడి
గూడూరు సర్కిల్ ఆఫీస్ లో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న గూడూరు రూరల్ మండలం ఇందూరు కు చెందిన కొవ్వూరు అరుణ్ కుమార్   పై అదే గ్రామానికి చెందిన గ్రామస్తులు దాడి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాత్రిపూట గుంపులుగా ఉండవద్దని హోంగార్డు అరుణ్ కుమార్  గ్రామస్తులను హెచ్చరించడంతో మాట మాట పెరిగి ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు...
అరుణ్ కుమార్ కు తీవ్ర గాయాలు కావడంతో గూడూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు*