హోం ఐసోలేషన్ పై ప్రత్యేక దృష్టిసారించండి
- ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు
-

జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు సంబంధించి హోం ఐసోలేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (dev)  ప్రభాకర్ రెడ్డి సూచించారు .నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జీజీ హెచ్) లో వివిధ వైద్య విభాగాల అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఏడు మంది హోం ఐసోలేషన్ కు అనుమతి జారీ చేశామన్నారు. హోం ఐసోలేషన్ ఉన్నవారిని ఎప్పటికప్పడు ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్, సూపర్ వైజర్, వాలంటీర్, ఆశ వర్కర్ నిత్యం వెళ్లి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారన్నారు. జిజిహెచ్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి సూచనలు సలహాలు జారీ చేస్తామని తెలిపారు. వారి ఆక్సిజన్ లెవల్స్ ను ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు తీసుకుంటారన్నారు. ప్రత్యేకంగా వీరిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక డాక్టర్ల బృందాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. తమ నివాస గృహాలలో ప్రత్యేక గదులు కలిగిన వారికి మాత్రమే హోమ్ ఐసోలేషన్ అనుమతి జారీ చేస్తూన్నామన్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి హోం ఐసోలేషన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వమన్నారు.

అలాగే ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ఉన్న వారికి సైతం హోమ్ ఐసోలేషన్ జారీ చేస్తామన్నారు. జిజిహెచ్ లో వీరి కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ ను కూడా ఏర్పాటు చేశామని డాక్టర్లు, అధికారులు వీరంతా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారని తెలిపారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ఎప్పుడైనా అత్యవసరమైతే వెంటనే 108 కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి, జిజిహెచ్ సూపరిటెండెంట్ శ్రీహరి, జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సాంబశివరావు పాల్గొన్నారు