కొల్లిపర మండలం మున్నంగిలో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు. ఓ గౌడ కులస్తుడికి పరాభవం ఎదురైంది. భార్యతో కలసి పొలం వెళ్లి వస్తున్న వ్యక్తి పట్ల యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో యువకులు మహిళను కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లు భర్త ఆరోపించారు. ఓ యువకుడిని ప్రతిఘటించిన భర్త సాంబశివరావును స్థానిక వైసీపీ నేతలు ఒంటిపై బట్టలు లేకుండా చేసి వేధింపులకు గురిచేశారు. నిందితులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి భర్త ఆరోపిస్తున్నారు. స్టేషన్ లో ఎస్ఐ ఎదుటే మరోసారి వైసీపీ నేతలు బెదిరింపులకు దిగినట్లు బాధితుడు పేర్కొన్నారు.