♦️ 3 వ తేదీ శనివారం ఉదయం వాకాడు నుండి కోట వరకు రన్ ఫర్ జీసస్


♦️ కోవిడ్ నిబంధనలు అనుసరించి రన్ ఫర్ జీసస్


 ♦️రన్ ఫర్ జీసస్ కు క్రైస్తవులు తరలిరావాలి


♦️ కోట,వాకాడు,చిట్టమూరు (కెవిసి)  మండలాల పాస్టర్స్ & లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేము దినకర్ బాబు పిలుపు 


క్రైస్తవుల ఐక్యతను చాటేందుకు ఈ నెల 3 వ తేదీ శనివారం నాడు జరిగే రన్ ఫర్ జీసస్ కు క్రైస్తవులు  తరలివచ్చి రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయాలని అనికోట,వాకాడు,చిట్టమూరు (కెవిసి)  మండలాల పాస్టర్స్ & లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేము దినకర్ బాబు పిలుపునిచ్చారు.


 శుక్రవారం వేము దినకర్ బాబు ఓ ప్రకటనలో పేర్కొంటూ విశ్వాసానికి శుభ శుక్రవారం సమయం మధ్యాహ్నం 3 గంటలు. అప్పుడే ఓ భయంకరమైన దుర్ఘటన జరిగింది. మానవాళి సిగ్గుతో తల దించుకోవలసిన సంఘటన అది. ఈ దృశ్యం చూడలేక భూన బోంతరాలు దద్దరిల్లినవి. కొండలు పగిలాయి. దేవాలయంలో తెర రెండుగా చిరిగిన రోజది . దేవాది దేవుడు తన ఏకైక కుమారుడైన ఏసుక్రీస్తును లోకానికి నరావతారిగా పంపాడు. అయితే అవినీతి పరులైన మతాధికారులు, దుష్టప్రజలు యేసు చెప్పిన పవిత్రమైన నీతిబోధలకు తాళలేక ఆయనను శిలువ వేసిన రోజది. 


 క్రీ.పూ 700 సంవత్సరాలు. యెహోవా అనే భక్తుడు ఈ దుస్సంఘటన గురించి ఇలా ప్రవచించాడు. మన అతిక్రమ క్రియలే అతడిని (క్రీస్తు) గాయపరిచాయి. మన సమాధానార్థమైన శిక్ష అతనిపై పడింది. అతని దెబ్బలతో మనకు స్వస్థత కలుగుతోంది. (యెష 53:5). 


 ఆకాశం, భూమి, సముద్రాలలోనున్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు పాపాలతో నశించే మానవులను కాపాడేందుకు యేసును భూమిపై అవతరింప జేసాడు. పవిత్ర రక్తం చిందిస్తేనే తప్ప వేరే మార్గంలో పాప విముక్తి కలుగదని వేదాలు ఘోషిస్తున్నాయి. ఏసంటే రక్షకుడని క్రీస్తు అనగా అభిషిక్తుడని భావం. పాప పంకిలం నుండి నరుడు విముక్తి పొంది, పవిత్ర జీవితం గడిపి స్వర్గానికి బాట నిర్దేశించే నీతి నియమాలతో కూడిన ప్రణాళికను ప్రభువైన ఏసు విశదం చేశాడు. సాతాను ఏర్పరిచిన ధనం, కీర్తి, సౌఖ్యం, వినోదం, అశ్లీలతతో కూడిన లైంగికానందాలనే పంచరంగుల వలలో మానవుడు చిక్కుకున్నాడు. 


 ఆ వల నుండి నరుని విముక్తి చేయడమే ఏసుక్రీస్తు ధ్యేయం. ఆశతో ఎగబాకే ఆయా రంగాల్లో ఎంత ఉచ్చస్థితి సాధించినా హృదయానికి తృప్తి, మానసికానందం లభించడం లేదు. అవన్నీ దూరపు కొండలే కదా!ఏసు తానే దైవకుమారుణ్ణని చెప్పినా యూదులంగీకరించలేదు. అక్రమ సంపాదపరులైన మతాధిపతులు తమ అన్యాయార్జితం క్రీస్తు సద్బోధలతో ఎక్కడ దూరమవుతుందోనని భయాందోళనలకు గురై ఎలాగైనా క్రీస్తును చంపేందుకే కుట్ర పన్నారు. తత్ఫలితంగా న్యాయాధికారి పిలాతు కు తప్పుడు సాక్ష్య నివేదిక సమర్పించారు. 


 ఆనాటి ఇశ్రాయేలీయుల రాజైన హేరోదుపై కూడా క్రీస్తును అంతం చేయాలని ఒత్తిడి తెచ్చారు. దాంతో చెయ్యని నేరాన్ని పవిత్రుడైన ఏసుపై ఆపాదించి శిక్షకు పరాకాష్ట అయిన శిలువ మరణమనే శిక్ష వేశారు. ఆ విధంగా శిలువ మరణం పొంది, తాను చెప్పిన ప్రకారం సమాధి చేధించుకుని మూడోనాడు ఏసు మృత్యుంజయుడై లేచి వచ్చాడు. ఆ రోజే గుడ్‌ఫ్రైడే. శుభ శుక్రవారం. సమాధి లోనుండి ప్రభువు తిరిగి లేచిన మూడవ రోజు ఆదివారం. దానినే ఈస్టర్‌ పండుగ అని పిలుస్తారు. ఇది క్రైస్తవులకు గొప్ప పండుగ. 


 ప్రపంచమంతా వారంలో ఒక్కరోజు (ఆదివారం) అన్ని వ్యాపారాలు, పనులు మాని జనులు గుంపులుగా, సమూహాలుగా కూడి ఆయనను ఆరాధించేందుకు వెడతారు. ‘‘చివరిగా చెప్పాలంటే, ఏసుక్రీస్తు మానవ జాతికి దేవుడిచ్చిన గొప్ప బహుమానం. దీన్ని పొందేందుకు మనం ప్రయాసపడాల్సిందేమీ లేదు. ఆయన్ను విశ్వసించడం తప్ప. 


 అందుకే ఏసు గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు క్రైస్తవులు ఎప్పుడూ ముందు ఉంటారు అనీ, ఆ నేపథ్యంలో క్రైస్తవుల ఐక్యత చాటేందుకు గత కొన్ని సంవత్సరాలుగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ఈ ఏడాది కూడా  రన్ ఫర్ జీసస్ కార్యక్రమం వాకాడులోని అశోక్ స్థూపం నుండి శనివారం  ఉదయం 6 గంటలకు ప్రారంభమైన కోట పట్టణంలో ని క్రాస్ రోడ్డు వద్ద ముగుస్తుంది అన్నారు,ఈ కార్యక్రమం కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించి సామాజిక దూరం పాటిస్తూ పోలీసులు నిబంధనలు ప్రకారం నిర్వహిస్తున్నట్లు దినకర్ బాబు వెల్లడించారు.