అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో విమాన ప్రమాదం సంభవించింది. విమాన ప్రమాదంలో మొత్తం ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్లోరిడాకు చెందిన కుటుంబం ఇండియానాలో జరిగే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చిన్న విమానంలో వెళ్తుండగా విమానం కూలి చనిపోయారు. రెండు ఇంజిన్లు గల టర్బో విమానం విల్‌స్టన్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. జార్జియాలోని ఈటన్టన్‌కు ఈశాన్యంగా ఆరు మైళ్ల దూరంలో టాన్వార్డ్‌ రోడ్‌ సమీపంలోని దట్టమైన అడవుల్లో కూలిపోయింది. అకస్మాత్తుగా వచ్చిన తుఫానే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక సమా
చారం.