ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోందా? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారు.. అనే చర్చ ఊపందుకుంది. మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీని వీడే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 3న ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎల్లుండి ఏపీ సీఎం జగన్ ను కలవనున్నారు గంటా. తన కుమారుడు రవితేజ ను గంటా జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం విశాఖ నార్త్ వైసీపీ ఇంచార్జ్ కేకే రాజుకు అమరావతి నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం లోని భీమిలి నియోజక వర్గానికి ఎమ్మెల్యే అనే విషయం అందరికి తెలిసిందే. తన ప్రాంతంలోని ఎమ్మెల్యే పార్టీలో చేరబోతునందుకే కేకే రాజునూ కూడా అమరావతికి రావాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. చూడాలి మరి అక్టోబర్ 3న ఎల్లుండి సీఎం జగన్ ను గంటా కలిసిన తర్వాత ఏం చేస్తారు అనేది