వెంకటాచలం, రవికిరణాలు: మినీలారీలో చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లను ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద నెల్లూరు టాస్క్ఫోర్స్ సీఐ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే విశాఖపట్నం జిల్లా పరిధిలోని ఏజన్సీ ప్రాంతం నుంచి చెన్నైకు మినీలారీలో 218 కేజిల బరువు గల 99 ప్యాకెట్ల గంజాయిని తరలిస్తుండగా వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లారీని సీజ్ చేసి వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గంజాయి విలువ 22 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ముగ్గురు నిందితులను నెల్లూరు టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.